Saturday, October 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADకొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ 

📰 Generate e-Paper Clip

ముషీరాబాద్, అక్టోబర్ 15, ( అద్దం న్యూస్ ) :  హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్ నగర్ లో నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు, స్వాతంత్ర్యోద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం 1969లోనే ప్రథమ దశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినప్పుడు, నాటి మంత్రివర్గంలో కీలకమైన పదవిలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తన మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేశారన్నారు. అధికారం ముఖ్యం కాదని, ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని నిరూపించిన నిజమైన నాయకుడన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యువ నాయకులు ముఠా జయసింహ, దోమల ( ఎయిర్‌టెల్ ) రాజు, పద్మశాలి ప్రజా సంఘం అధ్యక్షుడు తలకొక్కుల సంజీవ కుమార్, బిఆర్ఎస్ నాయకులు పున్న సత్యనారాయణ, రాకేష్, జన సమితి నాయకులు మెరుగు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page