ప‌ఠాన్‌బ‌స్తీలో క‌లుషిత నీరు రాకుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న ఎమ్మెల్యే – బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహా

ప‌ఠాన్‌బ‌స్తీలో క‌లుషిత నీరు రాకుండా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న ఎమ్మెల్యే

– బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహా

ముషీరాబాద్‌, సెప్టెంబ‌ర్ 04, అద్దం న్యూస్ :    ప‌ఠాన్‌బ‌స్తీలో క‌లుషిత నీరు రాకుండా ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు ముఠా జైసింహా అన్నారు. బిఆర్ఎస్ పార్టీ మైనారిటి సీనియ‌ర్ నాయ‌కుడు మ‌హ్మ‌ద్ జావీద్ ఖాన్ ఆధ్వ‌ర్యంలో ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్ బ‌స్తీలో గురువారం జైసింహ బిఆర్ఎస్‌ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. స్థానికులు వ‌చ్చి త‌మ బ‌స్తీలో నాలుగేళ్లుగా క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రా అవుతుంద‌ని, లో ప్రెష‌ర్ నీటి స‌మ‌స్య ఉంద‌ని ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకోలేద‌ని ముఠా జైసింహ‌తో వాద‌న చేశారు. దీంతో ముఠా జైసింహ వాట‌ర్ వ‌ర్క్స్ మేనేజ‌ర్ న‌వీన్‌ను బ‌స్తీకి రావాల‌ని ఫోన్ చేశారు. బ‌స్తీకి వ‌చ్చిన మేనేజ‌ర్‌తో క‌లిసి జైసింహ బ‌స్తీలో ప‌ర్య‌టించారు. ఎక్క‌డెక్క‌డ నీటి స‌మ‌స్య ఉందో చ‌ర్చించారు. క‌లుషిత నీటి స‌మ‌స్య రాకుండా చూడాల‌ని, అవ‌స‌ర‌మైతే నూత‌న పైప్‌లైన్ల కోసం బ‌డ్జెట్ పెట్టాల‌ని మేనేజ‌ర్‌ను ముఠా జైసింహ కోరారు. బ‌స్తీల్లో ఏ స‌మ‌స్య‌లున్నా ఎమ్మెల్యే గోపాల్ అన్ని శాఖల అధికారుల‌తో మాట్లాడి ప‌రిష్క‌రిస్తున్నార‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజ‌న్ అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు కొండా శ్రీధ‌ర్‌రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్‌, నాయ‌కులు ఇమ్రాన్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ ఇబ్ర‌హీం, జాఫ‌ర్‌, బ‌ల్వంత్‌, దీన్‌ద‌యాల్‌రెడ్డి, స‌త్య‌నారాయ‌ణ బాబు, ష‌కిల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page