సోషల్ మీడియా అకౌంట్లల్లో బిఆర్ఎస్ పేరును తొలగించని ఎమ్మెల్సి కవిత

వెబ్ డెస్క్, అద్దం న్యూస్ : ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్టానం మంగళవారం ఎమ్మెల్సి కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ లేఖను విడుదల చేసింది. అయితే బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సి కవిత తన సోషల్ మీడియా అకౌంట్లు అయినా ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లల్లో తన అకౌంట్ పేరు కింద ఎమ్మెల్సి అని, బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు అని ఇంకా అలాగే ఉంది. బిఆర్ఎస్ పార్టీ అనే పదాన్ని కవిత ఇంకా తొలగించలేదు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సి కవిత జాగృతి కార్యాలయంలో కాసేపట్లో తన ముఖ్య అనుచరులతో బేటీ కానున్నట్లు తెలిసింది. తన ఎమ్మెల్సి పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిసింది. మరో వైపు తెలంగాణ జాగృతి కార్యాలయానికి భారీగా చేరుకున్న కార్యకర్తలు. జై కవితక్క.. జై జాగృతి అంటూ కార్యకర్తల నినాదాలు చేస్తున్నారు. హరీష్‌రావు, జగదీష్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
https://www.instagram.com/kavitha_kalvakuntla?igsh=MWhxNTMweGNlNHd4Zg==
https://www.facebook.com/share/1Bmj55vyoq/https://x.com/RaoKavitha?s=08
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply