Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADప్రయాణికులకు మరిన్ని సేవలు – కాచిగూడ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు

ప్రయాణికులకు మరిన్ని సేవలు – కాచిగూడ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు

📰 Generate e-Paper Clip

ప్రయాణికులకు మరిన్ని సేవలు
– కాచిగూడ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు

కాచిగూడ‌, సెప్టెంబ‌ర్ 2, ( అద్దం న్యూస్ ) :   నగరంలోని ప్రయాణికులకు మరిన్ని సేవలు అందించడానికి ఆర్టీసీ సంస్థ నడుం బిగించిందని కాచిగూడ డిపో మేనేజర్ సీహెచ్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం విలేకరులతో డిపో మేనేజర్ వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ… ఆర్టీసీ సంస్థ ప్రయాణికులు, నైట్ రైడర్స్‌కు రాత్రి వెళల్లో ఇబ్బందులు తలెత్తకుండా వారి సౌకర్యార్ధం కోసం ప్రత్యేక బస్సులను కాచిగూడ డిపో ఆధ్వర్యంలో సీబీఎస్ నుండి రాత్రి 11.25 గంట‌ల‌కు, అర్థ‌రాత్రి దాటాక 1.55 గంట‌ల‌కు… ఆదే విధంగా పటాన్ చెరు నుండి రాత్రి 12.45, 3.15 నిమిషాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నైట్ రైడర్స్ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 99592 26190 లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page