వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు

విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలి
– గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలి
» వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) :  వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, భక్తులకు హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, పరస్పర సహకారంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. విఘ్నాలను తొలగించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించే వినాయక చవితి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, హైదరాబాద్ నగరం ప్రశాంతత, సౌభ్రాతృత్వం, సమగ్ర అభివృద్ధిలో ముందంజ వేయాలని వారు కోరుకున్నారు.

పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని, రసాయనాలతో కూడిన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే ఉత్సవాల సందర్భంగా ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ఇతరులకు ఇబ్బందులు కలగకుండా సంబరాలను నిర్వహించుకోవాలని సూచించారు. భక్తి, సేవ, సామాజిక బాధ్యతల సమ్మేళనంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని వారు పేర్కొన్నారు. విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మోతే శోభన్ రెడ్డి ఆకాంక్షించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page