Sunday, September 20, 2026
No menu items!
Homecinema'ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం'

‘ప్రేక్షకులను అలరించడమే నా లక్ష్యం’

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఛావా’, ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ వంటి హిట్ చిత్రాలతో కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్న రష్మిక (Rashmika Mandanna) త్వరలో ‘మైసా’ (mysaa) అనే నాయికా ప్రాధాన్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నటిగా తాను ఒకే ఇమేజ్‌కు పరిమితం కాకుండా అన్ని రకాల పాత్రల్లో కనిపించాలని కోరుకుంటున్నానని తెలిపింది. భాషతో సంబంధం లేకుండా ప్రతి పరిశ్రమను గౌరవిస్తూ వందశాతం అంకితభావంతో పనిచేస్తానని చెప్పింది. తన ప్రయాణంలో అనుభవాలే తనకు అసలైన బలం అని రష్మిక (Rashmika Mandanna) పేర్కొంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక (Rashmika Mandanna) గడిచిన ఏడాది గురించి, నటిగా తన ఆలోచన విధానం గురించి, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2025 సంవత్సరం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె (Rashmika Mandanna) తెలిపింది. “ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందని చెప్పలేను. కానీ ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం. నేను చేసిన పనుల పట్ల నా కుటుంబం, స్నేహితులు సంతోషంగా ఉండటాన్ని చూసి నాకు మరింత ఆనందం కలిగింది. ప్రేక్షకుల నుంచి లభించిన ప్రేమే నాకు అసలైన విజయం” అని రష్మిక (Rashmika Mandanna) చెప్పింది. “నేను ఒకే రకమైన పాత్రలకు పరిమితం కావాలని అనుకోవడం లేదు. మంచి అమ్మాయి, అమాయకురాలు అనే ఇమేజ్‌కే నన్ను కట్టిపడేయకుండా, నాలోని భిన్న కోణాలను ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నా. “నేను ఒక ఎంటర్‌టైనర్‌ని. ప్రేక్షకులను అలరించడమే నా ప్రధాన లక్ష్యం. అందుకే దర్శకులు ఏ విధంగా పాత్రను ఊహిస్తారో, ఆ దిశగానే నన్ను మలుచుకుంటాను” అని వివరించింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page