నేటి తరానికి ఓంకార్ ఆదర్శం
– రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ : నేటి తరానికి ఓంకార్ ఆదర్శమని రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఓంకార్ భవన్లో ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రకుమార్, ఎంసిపిఐ ( యు ) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె మల్లేష్, తుడుం అనిల్ కుమార్, పల్లె మురళి, ఎ.కిష్టయ్య, కర్ర దానయ్య తో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ… ఓంకార్ రాజకీయాలను సేవగా భావించి ప్రజల కోసం అహోరాత్రులు పోరాడిన నేత అని, శాసనసభలో ఓంకార్ అనేక ప్రజా సమస్యలపై ముందు తాను అధ్యయనం చేసి ఆ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారన్నారు. యావత్ రాష్ట్ర ప్రజలందరి సమస్యలపై పోరాడిన నాయకులు అని అలాంటి నాయకుని శతజయంతి వార్షికోత్సవాలు నిర్వహణ నేటి తరానికి స్పూర్తి ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంసిపిఐ ( యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ.. అసెంబ్లీలోనే కాకుండా భూమి, భుక్తి, విద్య, వైద్యం, సామాజిక న్యాయం కోసం చట్ట సభల వెలుపల కూడా అనేక సమరశీల ప్రజా పోరాటాలను ఓంకార్ నిర్మాణం చేశారన్నారు. పార్లమెంటు – పార్లమెంటేతర ఉద్యమాలు ఎలా నిర్మాణం చేయవచ్చో ఆచరించి నిర్మాణం చేసి చూపిన పీడిత జన నేత ఓంకార్ అని… ఆ మహోన్నత నేత శతజయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ మే 12 న వరంగల్ జిల్లా మచ్చాపూర్ వద్ద నిర్మాణం అయిన వారి సంస్మరణ కోసం ఆసియా ఖండంలో అతిపెద్ద స్థూపం వద్ద ప్రారంభ సభ ఉంటుందని అన్నారు. ఈ సభకు కవులు, కళాకారులు, వామపక్ష కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నేతలు హాజరవుతున్నారని, సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply