
హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును వెనక్కు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లు, లైబ్రరీ పెన్షనర్ల సంతకాల సేకరణ లిస్టులను హైదరాబాద్ కలెక్టర్ కు అందచేశారు. కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ పెన్షనర్లకు వ్యతిరేకంగా సోమవారం హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనను తెలియచేశారు. ఈ నిరసనలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరి జనరల్ డి.సుధాకర్, పూర్ణచందర్, తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యచరణ సమితి సెక్రటరి జనరల్ సత్యనారాయణ, పుల్లయ్య, తెలంగాణ ప్రభుత్వ లైబ్రరి పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొక్కుల దేవేందర్, ప్రధాన కార్యదర్శి సోమ శివయ్య, కోశాధికారి దాచేపల్లి బుచ్చయ్య, సంయుక్త కార్యదర్శి ఆడం, షఫి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ లైబ్రరి పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొక్కుల దేవేందర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన బిల్లును నిరసిస్తే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం జరిగిందన్నారు. లక్షలాది పెన్షనర్ల సంతకాల సేకరణ చేసి ఆ సంతకాల సేకరణను హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టామన్నారు. అనంతరం హైదరాబాద్ కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందచేశామని తెలిపారు. 2004లో పెన్షనర్లకు వ్యతిరేకంగా పాత పెన్షనర్లను అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసివేసిందని, దానిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసిందన్నారు. జనవరి 26 నుంచి పెన్షనర్లను తగ్గించాలని ఆలోచనలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు. దీని పై పెన్షనర్లందరం కోర్టులో కేసు వేయనున్నట్లు తెలిపారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply