Friday, September 18, 2026
HomeHyderabadరజాకార్ కాంగ్రెస్ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని విన‌య్‌కుమార్‌

రజాకార్ కాంగ్రెస్ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారు – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని విన‌య్‌కుమార్‌

 

హైదరాబాద్, ఏప్రిల్ 10, అద్దం న్యూస్ :   రజాకార్ కాంగ్రెస్ పాల‌న‌తో ప్ర‌జ‌లు విసిగిపోయారని, భ‌విష్య‌త్‌లో రాష్ట్రంలో బిజెపియే ప్ర‌త్యామ్నాయం అని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని విన‌య్ కుమార్‌ అన్నారు. బీజేపీ స్థాపన దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర బీజేపీ కార్యవర్గం పిలుపు మేరకు ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్ వివిగిరిన‌గ‌ర్, భోభిఘాట్, అరుంధతినగర్, సబర్మతినగర్, అన్నానగర్, వాల్మీకినగర్ త‌దిత‌ర బ‌స్తీల్లో గురువారం బీజేపీ నేతలు బ‌స్తీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బ‌స్తీల్లోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బ‌స్తీబాట‌ను కొన‌సాగించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావ‌నిమాట్లాడుతూ… ప్రజలుకు భూటకపు హామీలతో ఆశలు చూపి, వారి ఆశలను వమ్ము చేసిన రాష్ట్ర ప్రభుత్వ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇచ్చిన హామీల్లో 6 గ్యారెంటీలు సక్రమంగా అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ముందుకు వచ్చే ధైర్యం లేదన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, మహిళకు పెనషన్లు,పేదలకు రేషన్ కార్డుల అమలు చేయకుండా పేద ప్రజల మనుగడకు అడ్డుకట్ట వేసి వారిని నిరాశ్రయులను చేసిందన్నారు. అభివృద్ధి పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను బేఖాతరు చేసి ప్రజల ఉసురు తీస్తోందని ధ్వజమెత్తారు.  ఎక్కడ చూసినా ప్రభుత్వం పై వ్యతిరేకత వ్యక్తం అవుతుందని, త్వరలో ఈ రజాకార్ కాంగ్రెస్ పాలనకు స్వస్తి పలికి కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా, ప్రజలకు అభివృద్ధిని అందించి వారికి అండగా నిలిచే బీజేపీ పార్టీకి రానున్న ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించేందుకు ప్రజలు సన్నిద్ధమయ్యారని అన్నారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో బిజెపి భారీ విజ‌యాన్ని సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అద్యక్షులు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, విజయ లక్ష్మి, సంధ్యా రాణి, పూర్ణ, సంయుక్తా రాణి, మహమూద్, వాణి శాస్త్రి, సత్తి రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ప్రకాష్ యాదవ్, నర్సింహ, ఆనంద్ రావు, ధొనేటి సత్యం, డి.కుమార్, సురేష్, సాయి కృష్ణ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మి నారాయణ, తరుణ్, నీరజ్, రాజ్ కుమార్, ప్రశాంత్, బిజెపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page