PF Withdrawal: క్షణాల్లో గూగుల్ పే, ఫోన్ పేతో పీఎఫ్ డబ్బులు

PF Withdrawal: క్షణాల్లో గూగుల్ పే, ఫోన్ పేతో పీఎఫ్ డబ్బులు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఈపీఎఫ్ఓ (EPFO) ఖాతాదారులకు శుభవార్త. పీఎఫ్ డబ్బులు డ్రా (PF Withdrawal) చేసుకోవాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన పనిలేదు. అత్యవసర సమయాల్లో డబ్బు కోసం ఇబ్బంది పడకుండా, ఇకపై గూగుల్ పే (Google Pay), ఫోన్ పే (PhonePe) వంటి యూపీఐ యాప్స్ ద్వారా క్షణాల్లోనే మీ పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు రాబోతోంది.

సాధారణంగా పీఎఫ్ క్లెయిమ్ (PF Withdrawal) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే, అది పరిశీలించి డబ్బులు ఖాతాలో జమ కావడానికి 3 నుండి 4 రోజులు పట్టేది. ఈ జాప్యాన్ని నివారించడానికి, ఈపీఎఫ్ఓ కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. తాజా సమాచారం ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరం ఆరంభం (ఏప్రిల్) నుండి ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మొదట భీమ్ (BHIM) యాప్ ద్వారా, ఆ తర్వాత ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర యూపీఐ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు.

అంతేకాకుండా, భవిష్యత్తులో ఏటీఎంల (ATM) ద్వారా కూడా పీఎఫ్ డబ్బులు (PF Withdrawal) తీసుకునేలా ఈపీఎఫ్ఓ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ఖాతాదారుల డెబిట్ కార్డులను పీఎఫ్ ఖాతాలకు లింక్ చేసే ప్రక్రియను చేపట్టనున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా తీసుకువస్తున్న ఈ మార్పులు కోట్లాది మంది ఉద్యోగులకు ఎంతగానో మేలు చేకూర్చనున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page