పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి – ఎమ్మెల్యే ముఠా గోపాల్

పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి

– ఎమ్మెల్యే ముఠా గోపాల్

హైదరాబాద్, జులై 4, అద్దం న్యూస్ :  పింగ‌ళి వెంక‌య్య‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 62వ వర్ధంతి కార్యక్రమం శుక్ర‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్‌లోని ఈ సేవా చౌర‌స్తా, జ‌న‌ప్రియ అపార్ట్‌మెంట్ వ‌ద్ద జ‌రిగింది. పింగళి వెంకయ్య స్మారక సంస్థ, చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజ‌రై పింగళి వెంక‌య్య‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ…వెంక‌య్య కేవ‌లం ఒక శాస్త్ర‌వేత్త మాత్ర‌మే కాద‌ని, గొప్ప జాతీయ వాద‌న్నారు. భార‌త‌దేశానికి ఒక ప్ర‌త్యేక‌మైన జెండా ఉండాల‌నే ఆలోచ‌న‌తో మ‌న జాతీయ జెండాను రూపొందించార‌న్నారు. ఈ కార్యక్రమంలో పింగళి వెంకయ్య స్మారక సమితి ట్రస్ట్ ఛైర్మ‌న్‌ జగదాంబ, అధ్యక్షుడు శ్యామల రావు, ప్రధాన కార్య దర్శి బంగారు ప్రశాంత్, లక్ష్మణరావు, సలహాదారు అడ్వకేట్ శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరు శేష సాయి, పీసీసీ కార్యదర్శి జి.ఎన్.కేశవ్, బీఆర్ఎస్ నాయకులు ప్ర‌భాక‌ర్‌, హ‌రీష్‌, మేడి స‌త్య‌నారాయ‌ణ‌, రామ‌స్వామి తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page