ఘనంగా పింగళి వెంకయ్య 147 జయంతోత్సవాలు

హైదరాబాద్, ఆగస్టు 02, అద్దం న్యూస్ : శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కెహెచ్ఎస్.జగదాంబ, ఆ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కోడూరు శ్యామల రావు ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్ రాంనగర్ గుండు వద్ద గల ప్రధాన కార్యాలయంలో శనివారం పింగళి వెంకయ్య 147వ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగదాంబ మాట్లాడుతూ…. పింగళి వెంకయ్య ఆశయాలు మనమందరం కలిసి ముందుకు తీసుకువెళ్లాలన్నారు. అందరం కలిసి మెలిసి కులమత బేధాలు లేకుండా జీవించాలని ఆమె ప్రజలను కోరారు. పింగళి వెంకయ్యకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని జగదాంబ కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ సెక్రటరీ బంగారు ప్రశాంత్,సెక్రెటరీ సుధాకర్ రెడ్డి, బిజెపి డివిజన్ అధ్యక్షుడు సాయి కృష్ణ యాదవ్, కౌండిన్య ప్రసాద్, లక్ష్మణ్, బిజెపి డివిజన్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply