Saturday, September 19, 2026
No menu items!
HomeWorldటేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో మంటలు

టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా విమానంలో మంటలు

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా.. ఓ విమానంలో అగ్నిప్రమాదం సంభవించి పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటన బ్రెజిల్‌లోని గ్వారుల్హోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ320 విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో క్యాబిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page