PM Modi: క్రిస్మస్‌ వేడుకల్లో ప్రధాని మోదీ

PM Modi: క్రిస్మస్‌ వేడుకల్లో ప్రధాని మోదీ

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: దిల్లీలోని కెథెడ్రల్‌ చర్చ్‌ ఆఫ్‌ రిడెంప్షన్‌లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు (PM Modi attended the Christmas morning service). ఈ సందర్భంగా కొందరు క్రైస్తవులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను మోదీ (PM Modi) ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. దీనికి ముందు ఆయన ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు బోధనలు సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తాయన్నారు.

ఇక, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు సందేశం బలమైన సమాజాన్ని నిర్మిస్తోందన్నారు. యేసుక్రీస్తు బోధనలు శాశ్వత శాంతిని నెలకొల్పడంతో పాటు మానవుల మధ్య బంధాలను బలోపేతం చేస్తాయన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page