Friday, September 18, 2026
HomeHyderabad18 కిలోల గంజాయి ప‌ట్టివేత‌ మ‌హిళ‌ను, యువ‌కుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

18 కిలోల గంజాయి ప‌ట్టివేత‌ మ‌హిళ‌ను, యువ‌కుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

18 కిలోల గంజాయి ప‌ట్టివేత‌

మ‌హిళ‌ను, యువ‌కుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్, ఆగ‌స్టు 19, అద్దం న్యూస్ :    మహారాష్ట్ర ఔరంగబాద్ కు గంజాయి తరలిస్తున్న ఓ మహిళతో పాటు యువకుడిని దోమల‌గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిపి శిల్పవల్లి వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర ఔరంగబాద్‌కు చెందిన కోమల్ సోమినాధ్ ( 23 ) వరుసకు కొడుకు అయ్యే సాహిల్ మహేష్ సాలుంకే ( 18 ) తో కలిసి గంజాయి వ్యాపారం చేస్తుంది. విజ‌య‌వాడ‌కు చెందిన బాబు అనే వ్య‌క్తి వ‌ద్ద నుంచి గంజాయి తెచ్చి ఔరంగాబాద్‌లో ఎక్కువ ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తారు. ఇదే క్ర‌మంలో విజయవాడలో బాబు అనే వ్యక్తి నుండి గంజాయి కిలో 18 వేల చొప్పున 4.5 లక్షలు విలువ చేసే 18 కేజీల గంజాయి ను కొనుగోలు చేశారు. ఇదిలా ఉండ‌గా విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌క‌ మంగళవారం ఉదయం లిబర్టీ చౌరస్తాలో అనుమానాస్పదంగా లగేజ్ బ్యాగులతో ఉండగా దోమలగూడ‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించరించడంతో అసలు విషయం బయటపడింది. వారి వ‌ద్ద 18 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వీరు గత కొంతకాలంగా ఔరంగబాద్ లో ఈ గంజాయిను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గంజాయి విక్రయించిన బాబు అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు.

గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్స్ సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. సెంట్రల్ జోన్ అదనపు డిసిపి బి.ఆనంద్, గాంధీనగర్ డివిజన్ ఎసిపి ఎ.యాదగిరి, దోమల‌గూడ‌ పిఎస్ ఇన్‌స్పెక్ట‌ర్ డి.శ్రీనివాస్ రెడ్డి, దోమల‌గూడ‌ పిఎస్ ఎస్ఐ కె.శ్రీనివాస్ రెడ్డి, పిసి లు ఎస్.సాయి కుమార్, ఎండి.ఖలీల్, జె.సతీష్ కుమార్, అబ్బాస్, కుమార్ వి.దుర్గా భవాని, ఎస్‌కె.అబ్దుల్ ఖాదర్ జిలానీ పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page