Saturday, September 19, 2026
No menu items!
HomeLocal newsఅభ్యర్థికి కేటాయించని గుర్తు.. నిలిచిన పోలింగ్

అభ్యర్థికి కేటాయించని గుర్తు.. నిలిచిన పోలింగ్

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించకపోవడంతో పోలింగ్ నిలిచిపోయింది. ఈ వార్డులో నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా.. ముగ్గురికి ఎన్నికల సంఘం పక్షాన వచ్చిన బ్యాలెట్ పత్రాల్లో గుర్తులు కేటాయించారు. కానీ మూడో అభ్యర్థి యాదమ్మకు గుర్తు కేటాయించకపోవడంతో గమనించిన ఓటర్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. ఇక్కడ 161 మంది ఓటర్లు ఉండగా ఇప్పటికే 12 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page