Thursday, September 24, 2026
No menu items!
Homeculturalsఅలయ్‌–బ‌లయ్ కార్య‌క్ర‌మం పై స‌న్నాహ‌క స‌మావేశం

అలయ్‌–బ‌లయ్ కార్య‌క్ర‌మం పై స‌న్నాహ‌క స‌మావేశం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) :    అలయ్‌–బ‌లయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా ద‌స‌రా స‌మ‌యంలో నిర్వ‌హించే అలయ్‌–బ‌లయ్ కార్య‌క్ర‌మాన్ని ఈ ఏడాది కూడా ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం అలయ్‌–బ‌లయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి అధ్య‌క్ష‌త‌న హైద‌రాబాద్ రాంన‌గ‌ర్‌లో అలయ్‌–బ‌లయ్ కార్య‌క్ర‌మం పై స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్య అతిథిగా మాజీ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ హాజ‌ర‌య్యారు. రాబోయే అలయ్‌–బ‌లయ్-2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించే విషయంపై కమిటీ సభ్యులు వివిధ సూచనలు, సలహాలను ఈ సమావేశంలో అందించారు. కార్యక్రమ నిర్వహణ, అతిథుల ఆహ్వానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం, వేదిక నిర్వహణ తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే అలయ్ బలాయ్ వేడుకలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించేందుకు అందరి సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో శిల్పా రెడ్డి, వెంకట్ రమణి, ఆనంద్ గౌడ్, ఆర్.ప్రదీప్, డాక్టర్.సత్యం యాదవ్, డాక్టర్ ఆవుల రాంచందర్, గొంటి శంకర్ యాదవ్, వేద కుమార్, వకుళాభ‌ర‌ణం కృష్ణ మోహన్, కట్టా మల్లేష్, కేతినేని సరళ, మేకల సారంగపాణి, శ్రీరాములు యాదవ్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. 

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page