ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం –  విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన కార్పొరేటర్ పావని

ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం
» విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన కార్పొరేటర్ పావని

హైదరాబాద్, ఫిబ్ర‌వ‌రి 8, అద్దం న్యూస్ :   ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం 2025–26 క్రీడా పోటీల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్ మహిళా మ్యూజిక్ చైర్ పోటీలు చిక్కడపల్లిలోని పీపుల్స్ పార్క్‌లో, గాంధీనగర్ కెనరా బ్యాంక్ గ్రౌండ్‌లో సెమీ ఫైనల్ పోటీలు జ‌రిగాయి. ఈ పోటీల్లో గెలిచిన విజేతలకు ఫైనల్ రౌండ్ పీపుల్స్ పార్క్‌లో బ‌హుమ‌తుల ప్ర‌దానం కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ పోటీల్లో పాల్గొన్న రెండు టీమ్‌ల‌లో చిక్కడపల్లి నుండి సమన్విత మొదటి బహుమతి, భాను రెండవ బహుమతి అందుకోగా, గాంధీనగర్ నుండి పూర్ణ దేవి మొదటి బహుమతి, పద్మప్రియ రెండవ బహుమతి దక్కించుకున్నారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేటర్ పావ‌ని చేతుల మీదుగా విజేతలకు బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్న అందరికీ పార్టిసిపేషన్ బహుమతులను అందచేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, గేమ్స్ ఇన్చార్జి బద్రి నారాయణ, డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, బీజేపి నాయ‌కులు శ్రీకాంత్, రాజు, దామోదర్, పాల శ్రీనివాస్, పి.నర్సింగ్ రావు, సురేష్ రాజు, సత్యేందర్, సాయి గౌడ్, మంగమ్మ, సంయుక్త రాణి, పూర్ణ, అనూష తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page