బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు బహుమతుల అందజేత‌

బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు బహుమతుల అందజేత‌

హైదరాబాద్, మార్చి 22, అద్దం న్యూస్ :   ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సౌజన్యంతో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ 2026, బ్యాడ్మింటన్ పోటీలు, ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లోని ఘంటసాల శ్రీనివాస గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ స‌భ్యుడు కె.లక్ష్మణ్ హాజ‌రై బ్యాడ్మింటన్ విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు, బహుమతులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వంలో క్రీడాకారుల అభ్యున్నతికి పెద్ద పీట వేశారని… అందుకు నిదర్శనం బడ్జెట్‌లో క్రీడారంగానికి ప్రత్యేకంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడమే అని అన్నారు. దేశ వ్యాప్తంగా పల్లెల్లో, పట్టణాల్లో చేయూత అందని క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి.భారత్ గౌడ్, బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, సీనియర్ నాయకులు కోవా రాహుల్, బిజెపి గాంధీనగర్ డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్‌, ఆనంద్‌రావు, నాయ‌కులు శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, సురేష్ రాజు, సాయి కుమార్, నీరజ్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, శ‌శికాంత్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page