Friday, September 18, 2026
HomeHyderabadరాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి – ప్రజా వాణిలో జిల్లా...

రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి – ప్రజా వాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ :   రాజీవ్ యువ వికాస్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని భార‌త ప్ర‌జాతంత్ర యువ‌జ‌న స‌మాఖ్య ( డివైఎఫ్ఐ ) జిల్లా కార్య‌ద‌ర్శి ఎండి.జావీద్ అన్నారు. ఈ మేర‌కు సోమ‌వారం ప్ర‌జావాణిలో హైద‌రాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌కు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం జావీద్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకై రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత 16 లక్షల 25 వేల మంది దరఖాస్తులు చేసుకున్నార‌న్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా లక్షకు పైగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 వ తేదీన నిధులు మంజూరు చేస్తామని ప్రకటించింది.. కానీ దరఖాస్తుల పరిశీలన అయిపోలేదని వాయిదా వేయడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేసి నిధులు మంజూరు చేయాలని, బడ్జెట్ ను పెంచి అర్హులైన వారందరికీ పథకాన్ని వర్తింపచేయాలన్నారు. రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ఎలాంటి షరతులు లేకుండా లబ్ధిదారులందరికి నిధులు మంజూరు చేయాలని, ఈ పథకానికి బడ్జెట్ లో నిధులు పెంచాలని, రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులైన వారందరికీ ఈ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు రాజయ్య, రాము తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page