శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు, కార్పొరేటర్
హైదరాబాద్, ఏప్రిల్ 6, అద్దం న్యూస్ : హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌లో జరిగిన శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, వివేక్‌నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో, అశోక్‌నగర్ స్ట్రీట్ నంబర్ 4లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు రాజ్యసభ సభ్యుడు డాక్టర్.కె.లక్ష్మణ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని, బిజెపి సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అద్యక్షులు భారత్ గౌడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భగా వారు సీతారాముల వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ డివిజన్‌లోని వివి గిరి నగర్ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, చిక్కడపల్లి జ్ఞాన మధీర్, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ఐబి ఫ్లాట్స్ అపార్ట్‌మెంట్, ఆంధ్ర కేఫ్ చౌరస్తాలోని ముత్యాలమ్మ దేవాలయం, సిద్ధం శెట్టి అపార్ట్‌మెంట్లల్లో నిర్వహించిన శ్రీ సీతా రాముల కళ్యాణం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వి.నవీన్ కుమార్, ఎం.ఉమేష్, నర్సింహ, సాయి కుమార్, ఆనంద్ రావు, హన్మంతు, ధన్ రాజ్, చిర్ర యాదగిరి, జ్ఞానేశ్వర్, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply