కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు ర‌షీదుద్దీన్ ఆధ్వ‌ర్యంలో రంజాన్ వేడుక‌లు

కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు ర‌షీదుద్దీన్ ఆధ్వ‌ర్యంలో రంజాన్ వేడుక‌లు

హైదరాబాద్, మార్చి 21, అద్దం న్యూస్ :   హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ర‌షీదుద్దీన్ ఆధ్వ‌ర్యంలో రంజాన్ వేడుక‌లు శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.అర‌వింద్‌ కుమార్ యాద‌వ్, ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఎస్ఐ.రాజేష్‌, మాజీ కార్పొరేట‌ర్ ఆర్‌.క‌ల్ప‌న యాద‌వ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారికి శాలువాలు క‌ప్పిన ర‌షీదుద్దీన్ ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్భంగా అల‌య్ బ‌ల‌య్ చేసుకుని రంజాన్ శుభాకాంక్ష‌లు తెలియ‌చేశారు. ఈ వేడుక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కొండ‌ల్‌, మేడి సురేష్‌, పెండెం శ్రీనివాస్ యాద‌వ్‌, సంగ‌పాక వెంక‌ట్‌, కృష్ణ‌గౌడ్‌, ర‌ఘు, భాస్క‌ర్‌, జ‌య‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page