Friday, September 18, 2026
HomeNationalఅతడు అసలేమీ మారలేదు: Ravichandran Ashwin

అతడు అసలేమీ మారలేదు: Ravichandran Ashwin

అతడు అసలేమీ మారలేదు: Ravichandran Ashwin

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ ప్రదర్శనను చూస్తుంటే, ఆయన తన చిన్ననాటి ఉత్సాహంతోనే ఆడుతున్నట్లు కనిపిస్తోందని అశ్విన్ విశ్లేషించారు.

వడోదరలో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ 93 పరుగులతో ఆకట్టుకున్నారు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ, భారత్ విజయంలో ఆయనది కీలక పాత్ర. కోహ్లీ ఫామ్ గురించి అశ్విన్ మాట్లాడుతూ.. “విరాట్ ప్రస్తుతం కేవలం బ్యాటింగ్ మీద మాత్రమే దృష్టి పెట్టాడు. ఆయనలో ఏ మార్పు లేదు. తను చిన్నప్పుడు ఎంతటి ఉత్సాహంతో, ఏ యాటిట్యూడ్‌తో క్రికెట్ ఆడాడో.. ఇప్పుడూ అలాగే ఆడుతున్నాడు. దీనికి ఆయన సుదీర్ఘ అనుభవం తోడైంది.” అని పేర్కొన్నారు. వరుసగా ఏడోసారి 50+ స్కోరు నమోదు చేసి కోహ్లీ తన భీభత్సమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నారని అశ్విన్ కొనియాడారు.

శ్రేయస్ అయ్యర్ కమ్‌బ్యాక్‌పై విశ్లేషణ

గాయం నుండి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి కూడా అశ్విన్ మాట్లాడారు. ప్లీహానికి (Spleen) అయిన గాయం కారణంగా కొన్ని నెలలు ఆటకు దూరమైన అయ్యర్, తొలి వన్డేలో 49 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. “వన్డేల్లో అయ్యర్ అత్యంత నిలకడైన ఆటగాడు. ఆయన సెట్ అయితే ఇన్నింగ్స్ పూర్తి చేసే వరకు క్రీజులోనే ఉంటాడు.” “జమీసన్ వేసిన మంచి బంతికి ఆయన అవుట్ అవ్వడం దురదృష్టకరం. అయితే ఇది ఆయనకు కమ్‌బ్యాక్ మ్యాచ్ అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి.” అని తెలిపారు. విరాట్ కోహ్లీ తన తదుపరి మ్యాచ్‌లో సెంచరీ సాధించి, తన అత్యుత్తమ రికార్డును కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page