LIDCAP భూముల పరిరక్షణ చేయాల‌ని మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు విన‌తి

గచ్చిబౌలి LIDCAP భూముల పరిరక్షణ చేయాల‌ని మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు విన‌తి

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 10, అద్దం న్యూస్ :   గచ్చిబౌలి LIDCAP భూముల పరిరక్షణ చేయాల‌ని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబును తెలంగాణ చర్మకారుల సంఘాల జేఏసీ నాయ‌కులు కోరారు. బుధ‌వారం హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని మినిష్ట‌ర్ క్వార్ట‌ర్స్‌లో మాదిగ మేధావుల ఫోరం అధ్య‌క్షుడు, తెలంగాణ చ‌ర్మ‌కారుల సంఘాల జేఏసి ఛైర్మ‌న్ డాక్ట‌ర్‌.ఆరేపల్లి రాజేందర్ ఆధ్వ‌ర్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గచ్చిబౌలిలోని లిడ్ క్యాప్ TGLIPC భూములలో యూనిట్ మాల్, ఇతరులకు పెట్రోల్ బంక్ లీజు జిఓ rt 137 ను రద్దు చేసి క్యాన్సిల్ లెటర్ ఇవ్వాలని, LIDCAP భూములను పరిరక్షించాల‌ని, వెంటనే పునరుద్ధరించాని కోరుతూ మంత్రి శ్రీధ‌ర్‌బాబుకు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి శ్రీధ‌ర్‌బాబు త‌న‌ను క‌లిసిన తెలంగాణ చర్మకారుల సంఘాల జేఏసీ నాయ‌కులతో మాట్లాడుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ అందుబాటులో లేర‌ని, అందుబాటులోకి వచ్చిన వెంటనే దీన్ని రద్దు ( బ్లాక్ అండ్ వైట్ ఆర్డర్ ) క్యాన్సల్ లెటర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా 500 కోట్లతో తెలంగాణలో లెదర్ పార్కుల‌ అభివృద్ధికి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని, అది ఈ మద్యనే మేము చ‌ర్చించామ‌ని మంత్రి తెలిపారు.                                                              త్వరలో LIDCAP కార్పొరేషన్ సంస్థను పునః ప్రారంభంచి అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు. మంత్రిని క‌లిసిన వారిలో మాదిగ మేధావుల ఫోరం ముఖ్య సలహాదారులు పల్లెల వీరస్వామి, పారిశ్రామికవేత్త సామర్ల కిరణ్, అడ్వ‌కేట్ నల్ల మాణిక్ రావు, వలిగొండ నర్సింహా, గుమ్మడి సతీష్, తెలంగాణ చర్మకారుల సంఘాల జేఏసీ కోశాధికారి చంద్రగిరి, తెలంగాణ స్టేట్ లెదర్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, అధికార ప్రతినిధులు శివ మాన్కర్, సత్యేంద్ర తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page