యువశక్తి ఆధ్వర్యంలో జ‌రిగిన ఉచిత వైద్య శిబిరానికి స్పంద‌న‌

యువశక్తి ఆధ్వర్యంలో జ‌రిగిన ఉచిత వైద్య శిబిరానికి స్పంద‌న‌


ముషీరాబాద్‌, ఆగ‌స్టు 31, అద్దం న్యూస్ :    హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం రాంన‌గ‌ర్ డివిజ‌న్ జెమిస్తాన్‌పూర్ ఎస్ఆర్‌కె న‌గ‌ర్‌లో ఆదివారం జ‌న‌హిత సేవా ట్ర‌స్ట్‌, యువ శ‌క్తి యూత్, కిమ్స్ ఫౌండేష‌న్ –రీసెర్చ్ సెంట‌ర్ సంయుక్తాధ్వ‌ర్యంలో ఉచిత వైద్య శిబిరం జ‌రిగింది. రాజ్ కిరణ్ మహేష్ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ వైద్య శిబిరానికి పేద ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. శిబిరానికి విశేష స్పంద‌న వ‌చ్చింది. వైద్యులు పేద‌ల‌కు వైద్యం అంద‌చేసి ఉచితంగా మందుల‌ను అంద‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో బీజేవైఎం ముషీరాబాద్ కన్వీనర్ గడ్డం నవీన్, స‌భ్యులు కిర‌ణ్‌, చింటు, బిజెపి రాంన‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు గ‌డ్డం స‌తీష్, శివ క్రిష్ణ‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.



 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page