లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్న రేవంత్ – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్‌.ఆర్ఎస్‌.ప్ర‌వీణ్ కుమార్‌

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి మళ్లీ తన అలవాటు ప్రకారం అడ్డదారులు తొక్కుతున్నారని బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు డాక్ట‌ర్‌.ఆర్ఎస్‌.ప్ర‌వీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. గురువారం స‌మావేశంలో ఆర్ఎస్‌పి మాట్లాడుతూ… దళిత, గిరిజన వర్గాల పక్షాన పోరాడుతున్న కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా బుక్ చేస్తారు ? ఎస్సీ, ఎస్టీలను నట్టేట ముంచిన రేవంత్ రెడ్డిపైనే అట్రాసిటీ కేసు చేయాలా ? ఈ విషయంలో తెలంగాణ పోలీసులు సీరియస్‌గా ఆలోచించాలని ప్రవీణ్ కుమార్ అన్నారు. పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీని ప్రశ్నిస్తే కేసులు పెడతారా ? లీకేజీ మాఫియాకు, కాంగ్రెస్ నాయకులకు ఉన్న సంబంధాలను ప్రజలకు చెప్పడం నేరమా ? కేటీఆర్ దళితులను ఏమన్నారు ? ఎక్కడ ఎవరిని దూషించారని అట్రాసిటీ కేసు పెట్టారు ? ఆయనకు నిందితుల కులం తెలిసే అవకాశముందా ? పదవ తరగతి విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీలు లేరా ? వారికి జరిగిన అన్యాయంపై కేటీఆర్, క్రిషాంక్ మాట్లాడకూడదా ? అని అన్నారు. కేటీఆర్‌పై కేసు ఎందుకు ? బీఆర్‌ఎస్ పార్టీ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టినందుకా ? సచివాలయానికి అడగకుండా అంబేడ్కర్ పేరు పెట్టినందుకా ? వేలాది దళితులకు దళిత బంధు పథకం అమలు చేసినందుకా ? దళిత, గిరిజనుల కోసం గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు స్థాపించినందుకా? విద్యార్థులకు కోడింగ్ నేర్పించి విదేశాలకు పంపినందుకా ? అని అన్నారు.

అసలు అట్రాసిటీ కేసు ఎవరిపై బుక్ చేయాలి ? 80 మంది గురుకుల విద్యార్థుల ప్రాణాలు తీసిన రేవంత్ ప్రభుత్వంపైన, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించినందుకు, యాదాద్రిలో ఉప ముఖ్యమంత్రిని అవమానించినందుకు, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని గేట్లు మూసి బంధించినందుకు, అసెంబ్లీ స్పీకర్‌ను దళితుడని అవమానించినందుకు రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల, ఇంద్రవెల్లిలో దళితులను మోసం చేసిన రాహుల్ గాంధీ, రేవంత్‌పై కేసు పెట్టాలని, లగచర్లలో గిరిజన భూములను కబ్జా చేసిన తిరుపతి రెడ్డిపైనా, గ్రూప్ 1, 2 లో వర్గీకరణ హామీ ఇచ్చి మోసం చేసిన రేవంత్‌పైనా అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముమ్మాటికీ అసమర్థుడని.. విద్యా శాఖ మంత్రిగా పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం కూడా చేతకాలేదు. పోలీసులు, అధికారులు ఉండగా నిందితుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వెళ్లాడు ? జిరాక్స్ సెంటర్లు ఎలా తెరిచాయి ? ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఇంటలిజెన్స్ ఏం చేసిందని ప్ర‌శ్నించారు. కేటీఆర్, క్రిషాంక్, దిలీప్ కొణతంపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page