హైదరాబాద్, మే 24, అద్దం న్యూస్ : శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఇప్పటి ముఖ్యమంత్రి నాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ చేస్తున్నామని గొప్పగా ప్రచార ఆర్భాటం చేసి కర్ణాటక ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పిలిపించి కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వాగ్దానం చేసి మరిచారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శనివారం దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ….అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎలాగైనా మరుగున పెట్టాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఇప్పటికీ బిసి డిక్లరేషన్ హామీని మర్చిపోలేదన్నారు. ఆ విషయాన్ని మభ్య పెట్టడానికి కులగలను పేరుతో సర్వే మొదలు పెట్టి తప్పుల తడకగా సర్వే నిర్వహించి బీసీలను 42 శాతంగా చూపించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో 56 శాతం బీసీలు ఉన్నట్లు ప్రకటించారని, ఈ తొమ్మిదేళ్లలో మళ్లీ సర్వే చేస్తే బీసీల సంఖ్య తక్కువ కావడం విడ్డూరంగా ఉందని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపి బీసీల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని, ఇటీవల ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం సలహాదారులుగా నియమించిన వారిలో పూర్తిగా అగ్రవర్ణాలకే పెద్ద పీట వేసారని సాయిబాబా అన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే 42 శాతం రిజర్వేషన్లు శాంతి సంస్థలు కల్పించి అనే ఒక ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల గడువు ముగిసి సంవత్సరం పైబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. కులగణన సాకుతో స్థానిక సంస్థలను వాయిదా వేస్తూ వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా కులణన చేపడితే, తప్పులున్నాయని ప్రజలు తిరగబడడంతో మళ్లీ రీసర్వే నిర్వహించి, కులగణనా రిపోర్టను ఇప్పటివరకు బహిర్గతం చేయలేదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు విధానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి నిరూపించుకోవాలని సాయిబాబా అన్నారు. బీసీలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజ్ గౌడ్, నాయకులు ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply