చిల్ల‌ర డ్రామా చేస్తున్న రేవంత్‌రెడ్డి  – కేటీఆర్ మీద రాజకీయ కక్ష సాధింపు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :    స్థానిక సంస్థల ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి మరో చిల్లర డ్రామాకు ప్రయత్నిస్తున్నాడు.. ఇది ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌ కేటీఆర్‌పై ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై గురువారం హ‌రీష్ రావు స్పందించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నాడని హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. ఫార్ములా ఈ రేస్ పూర్తి పారదర్శకతతో జరిగింది.. దీనిపై కేసు పెట్టి కాంగ్రెస్‌ సర్కార్‌ రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతుందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడని ధ్వ‌జ‌మెత్తారు. కేటీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది.. రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామ‌న్నారు.




https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page