రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆర్‌పిఐ పార్టీ పోటీ

త్వరలోనే ఆర్‌పిఐ తెలంగాణ  రాష్ట్ర నూతన కమిటీ
» రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఆర్‌పిఐ పార్టీ పోటీ
– రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాజాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు

హైదరాబాద్,  జూన్ 18, ( అద్దం న్యూస్ ) :      రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో రిపబ్లిక‌న్‌ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర జాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ… తెలంగాణలో బీజేపీ – ఆర్‌పిఐ కూటమి అత్యంత పటిష్టంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. భాగ్యనగర జీహెచ్‌ఎంసీ మేయర్ పదవిని కైవసం చేసుకుని, ఆ మేయర్ పీఠాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక అద్భుతమైన బహుమానంగా ఇవ్వడానికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రిపబ్లికన్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే రాబోయే ఆగస్టు నెలలో తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారని తెలిపారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్న ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొంపెల్లి ప్రభుదాస్, పసుల రవి, గోరక్ సింగ్,, శ్రావణ్, సచిన్ గౌడ్, హనుమ ప్రసాద్, శివరాజ్, పీటర్, నాయుడు, స్నేహలత, గంగాపురం పద్మ రోజా తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page