హైదరాబాద్, అద్దం న్యూస్ : ఏప్రిల్ 23 నుంచి మే 1వ తేదీ వరకు ఆర్‌విఎల్ఎల్‌బిఎస్ బసవ ప్రీమిర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పట్లోల్ల సంగమేశ్వర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి దినేష్ పాటిల్, రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర సెంట్రల్ కమిటీ సభ్యులు శెట్టి శివకుమార్, రాష్ట్ర కోశాధికారి, దశాబ్ది ఉత్సవ కమిటీ కన్వీనర్ కల్లపల్లి రాచప్పలతో కలిసి సంగమేశ్వర్ లీగ్‌కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఏప్రిల్ 23 నుండి మే 1 వరకు అప్పా జంక్షన్ వద్ద అజీజ్‌నగర్ ది పెవిలీయన్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించబోతున్న ఆర్‌విఎల్ఎల్‌బిఎస్ బసవ ప్రీమిర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2లో కేవలం వీరశైవ లింగాయత్ లింగ బలిజ, జంగమ వారికే అవకాశం ఉందన్నారు. వీరశైవ లింగాయత్ లింగ బలిజ కుల సంఘం దశాబ్ది ఉత్సవ వేడుకల్లో భాగంగా ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను, ఇతర క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శివ శరణ్, యువజన అధ్యక్షుడు భరత్, భోజన ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply