...

సీఎం సభను అడ్డుకుంటాం

నకిరేకల్ సీఎం సభను అడ్డుకుంటాం
ఎన్నికల హామీలో నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రభుత్వం నుంచి జీవోలు, నిధులు విడుదలైన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి న‌కిరేక‌ల్‌కు రావాలి
» బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్

నార్కెట్‌ప‌ల్లి, సెప్టెంబ‌ర్ 2, ( అద్దం న్యూస్ ) :   నకిరేకల్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతనే నకిరేకల్ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి రావాల‌ని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రాందేవ్ అన్నారు. బుధ‌వారం న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన స‌మావేశంలో రాందేవ్ మాట్లాడుతూ… నకిరేకల్ నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయని, ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీలు అమలు చేసిన తర్వాతే ఈ నియోజకవర్గానికి రావాల‌న్నారు. ప్రభుత్వ నుంచి జీవోతో పాటు నిధులు ఇచ్చిన తర్వాతే సీఎం నియోజకవర్గంలో అడుగు పెట్టాలన్నారు. కొడంగల్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో నకిరేకల్ నియోజకవర్గాన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చేయాల‌ని డిమాండ్ చేశారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తాం.. మా అభ్యర్థిని గెలిపించాల‌ని చెప్పి గెలిచిన తర్వాత నకిరేకల్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి నోచుకోలేద‌న్నారు. ఆనాడు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఫార్మసీ కాలేజ్,ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తామన్నారని తెలిపారు.

ఎస్ఎల్‌బిసి తో పాటు ధర్మారెడ్డి పిల్లాయిపల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నార‌ని, రామన్నపేటకు మెడికల్ కాలేజ్ మంజూరు గురుకుల పాఠశాలలో మంజూరు చేస్తామన్నామ‌ని మ‌రిచిపోయార‌ని విమ‌ర్శించారు. నియోజకవర్గంలో ఉన్న ఏడు మండల టౌన్లకు 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని, ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం కాబ‌ట్టి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పి విస్మ‌రించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని, విద్యార్థులకు రావాల్సినటువంటి పది వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ అగ్రవర్ణ పేదలంతా ఏకతాటి మీద ఉండి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. నియోజకవర్గానికి ఇచ్చిన అన్ని హామీల జీవోలతో పాటు నిధులు విడుదల చేసిన తర్వాతే సీఎం సభ నిర్వహించాలని అన్నారు. లేకపోతే ఎక్కడ అక్కడ గ్రామ గ్రామాన అడ్డుకుంటామ‌ని… ప్రభుత్వ నాయకులను తరిమికొడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ యువజన సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎడ్ల మహలింగం, వెంకటేశ్వరరావు, మనీల్, సురేష్, సంతోష, భాస్కర్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.