కోట శ్రీనివాస్‌రావు మృతి బాధాక‌రం – తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్ పి.సాయిబాబా

హైదరాబాద్, జులై 14, అద్దం న్యూస్ :   ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలుగుదేశం సికింద్రాబాద్ పార్లమెంట్‌ కన్వీనర్ పి.సాయిబాబా, టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, భాను ప్రకాష్, కిరణ్, సుక్రవేది త‌మ‌ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియ జేసారు. వారి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని అన్నారు. 4 దశాబ్దాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దాదాపు 750 కి పైగా సినిమాలలో నటించార‌ని, ఒకపక్క ఆయన పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, మరోపక్క విలన్ గా ముచ్చెమటలు పట్టించే విలక్షణ నటుడిగా కోట శ్రీనివాస్‌రావు తనదైన ముద్ర వేసారని సాయిబాబా తెలిపారు. అదే వింధగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 200లకు పైగా సినిమాల్లో నటించిన సీనియర్ నటి బి.సరోజా దేవి మరణం ప‌ట్ల సాయిబాబా త‌న సంతాపం తెలిపారు. పద్మభూషణ్ గ్రహీత సరోజాదేవి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఏక కాలంలో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించారని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. తెలుగులో ఎన్టీఆర్ తో అనేక సినిమాల్లో కలిసి నటించారని, భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ లాంటి ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆమె ఎంతో దగ్గరయ్యారని సాయిబాబా తెలిపారు. బి.సరోజా దేవి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page