Sunday, September 20, 2026
No menu items!
HomeAPప్రయాణికుల రద్దీ.. 10 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ.. 10 ప్రత్యేక రైళ్లు

📰 Generate e-Paper Clip

ప్రయాణికుల రద్దీ.. 10 ప్రత్యేక రైళ్లు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఛైర్ కార్, జనరల్ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ నెల 11, 12, 13, 18, 19 తేదీల్లో ఉదయం 6.10 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఈ నెల 10, 11, 12, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్ బోగీల ఏర్పాటు చేయనున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page