Sunday, September 20, 2026
No menu items!
HomeNationalSarfaraz Khan: గోవా బౌలర్లకు 14 సిక్సర్లతో చుక్కలు చూపించిన సర్ఫరాజ్!

Sarfaraz Khan: గోవా బౌలర్లకు 14 సిక్సర్లతో చుక్కలు చూపించిన సర్ఫరాజ్!

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో (Vijay Hazare Trophy) ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) పరుగుల వరద పారించాడు. గోవా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగి, బౌండరీల మోత మోగించాడు. కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేసి మైదానంలో విధ్వంసం సృష్టించాడు.

ముంబై ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్ (Sarfaraz Khan).. 56 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉండటం విశేషం. ఏకంగా 209.33 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్.. తన సోదరుడు ముషీర్ ఖాన్‌తో (Musheer Khan) కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సర్ఫరాజ్ దూకుడుతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 444 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.

మరోవైపు, గోవా తరపున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) బౌలింగ్‌లో నిరాశపరిచాడు. 7 ఓవర్లు వేసిన అర్జున్, వికెట్లేమీ తీయకుండా 62 పరుగులు సమర్పించుకున్నాడు. సర్ఫరాజ్ (Sarfaraz Khan)ఆడిన ఈ ఇన్నింగ్స్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page