Sunday, September 20, 2026
No menu items!
HomeFoodLate Night Sleep: రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రాణాలకే ప్రమాదం!

Late Night Sleep: రాత్రి నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రాణాలకే ప్రమాదం!

📰 Generate e-Paper Clip

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది రాత్రిపూట నిద్రను (Late Night Sleep) నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో ఉండేవారు, షిఫ్ట్ ఉద్యోగాలు చేసేవారు, ఫోన్లు, టీవీలకు అతుక్కుపోయే యువత సరైన సమయానికి నిద్రపోవడం లేదు. కనీసం 5 గంటలు కూడా నిద్రపోని వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య సమస్యలు: తాజా అధ్యయనాల ప్రకారం, రోజుకు 3-4 గంటల కంటే తక్కువ నిద్రపోయే (Late Night Sleep) వారి రక్తంలో మార్పులు సంభవించి, గుండె సంబంధిత వ్యాధులు (Heart Diseases) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కేవలం వృద్ధులే కాకుండా, ఆరోగ్యంగా ఉండే యువతలో కూడా నిద్రలేమి కారణంగా రక్తపోటు పెరగడం, గుండె సమస్యలు రావడం జరుగుతోందని ఒక ప్రయోగంలో తేలింది. అలాగే రాత్రి ఆలస్యంగా పడుకోవడం (Late Night Sleep) లేదా ఆలస్యంగా మేల్కొనడం వల్ల ఆందోళన (Anxiety), నిరాశ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి.

నిపుణుల సూచనలు:

రాత్రిపూట (Late Night Sleep) తేలికపాటి భోజనం చేసి త్వరగా నిద్రకు ఉపక్రమించాలి.
పడుకునే ముందు గోరువెచ్చని పాలలో పసుపు లేదా తేనె కలుపుకుని తాగడం మంచిది.
పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి.
చీకటి గదిలో పడుకోవడం, తల, పాదాలకు మసాజ్ చేసుకోవడం ద్వారా మంచి నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page