ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో బిఆర్ఎస్ పార్టీకి షాక్‌ – బిజెపిలో చేరిన అడిక్‌మెట్‌ డివిజన్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కె.సురేందర్

  •  క‌డ‌ప సురేంద‌ర్ బిజెపిలో చేర‌డం పార్టీకి మ‌రింత బ‌లం
  • – డాక్ట‌ర్.కె.ల‌క్ష్మ‌ణ్‌

హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ :   బిఆర్ఎస్ పార్టీ 25 సంవ‌త్స‌రాల ర‌జ‌తోత్స‌వ స‌భ జ‌రుగుతున్న వేళ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆ పార్టీకి షాక్ త‌గిలింది. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో బిఆర్ఎస్ పార్టీకి గ‌డ్డుకాలం న‌డుస్తుంద‌నే చెప్పొచ్చు. గ‌త కొన్ని రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలోని డివిజ‌న్ల అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు స‌ఖ్య‌త కుద‌ర‌డంలేదు. అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల మ‌ధ్య గ్యాప్ పెరిగింది. కొన్ని డివిజ‌న్ల‌ల్లో అధ్య‌క్షుడి పెత్త‌నం వ‌ల్ల‌నే ఈ గ్యాప్ పెరిగింద‌ని పార్టీలో చ‌ర్చించుకుంటున్నారు. శుక్ర‌వారం ఆర్య‌వైశ్య హాస్ట‌ల్ సెమినార్ హాల్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఏ ప‌ద‌వి లేని వారికి ప్రాధాన్య‌త ఇచ్చి మాట్లాడించి…త‌న‌ను మాత్రం మాట్లాడ‌నివ్వ‌లేద‌ని ముషీరాబాద్ డివిజ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆకుల అరుణ్ అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా అడిక్‌మెట్‌ డివిజన్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కె.సురేందర్ బిజెపిలో చేరిన చేరారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా సురేంద‌ర్ అంశం పై జోరుగా చ‌ర్చ‌లు జ‌రిగాయి.

బిఆర్ఎస్‌లో అంకిత‌భావంతో ప‌ని చేసినా గుర్తింపు లేదు : కె.సురేందర్ 

అడిక్‌మెట్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌డ‌ప సురేంద‌ర్‌, ఆయ‌న భార్య అనురాధ శ‌నివారం బిజెపిలో చేరారు. వాస్త‌వానికి క‌డ‌ప సురేంద‌ర్ బిఆర్ఎస్ పార్టీలో చాలా కీల‌క నాయ‌కుడు. డివిజ‌న్‌లో అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తారు. డివిజ‌న్‌లోని బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులెవ‌రూ సేవా కార్య‌క్ర‌మాల్లో కానీ, పార్టీ కార్య‌క్ర‌మాల్లో కానీ ఎవ‌రూ ముందుకు రాక‌పోయినా సురేంద‌ర్ మాత్రం త‌న సొంతంగా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తార‌నే పేరు ఉంది. అటువంటి నాయ‌కుడు పార్టీలో ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలేద‌ని శ‌నివారం బిజెపి ఓబిసి మోర్చ జాతీయ అధ్య‌క్షుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ స‌మ‌క్షంలో బిజెపిలో చేరారు. అడిక్‌మెట్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు పాశం సాయికృష్ణ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప సురేంద‌ర్ బిజెపిలో చేరారు. ఈ సంద‌ర్భంగా పార్టీ కండువాను ల‌క్ష్మ‌ణ్ సురేంద‌ర్‌కు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ…క‌డ‌ప సురేందర్ బిజెపిలోకి రావడం శుభ పరిణామం అని చెప్పారు. ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు కల్పించి పదవి ఇస్తామని చెప్పారు. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో అడిక్‌మెట్‌లో బిజెపి జెండా ఎగరవేస్తుందని చెప్పారు. పార్టీలో చేరిన సురేంద‌ర్‌ మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీలో ఎంతో అంకితభావంతో పనిచేసిన తగిన‌ గుర్తింపు… మర్యాద లేదన్నారు. అందుకే బిజెపిలో చేరినట్లు స్పష్టం చేశారు. అడిక్‌మెట్ డివిజ‌న్ బిజెపి అధ్య‌క్షుడు పాశం సాయి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ… ప్రజలతో అనునిత్యం సంబంధాలు గల సురేందర్ బిజెపికి రావడం పార్టీకి మరింత బలం చేకూరిందని చెప్పారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page