హైదరాబాద్, జూన్ 23, అద్దం న్యూస్ : దేశం కోసం శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ( బలిదాన్ దివస్ ) కార్యక్రమం సోమవారం గాంధీనగర్ డివిజన్ జవహర్‌నగర్ టిఆర్టి గ్రౌండ్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హాజరై టిఆర్టి గ్రౌండ్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పావని మాట్లాడుతూ… ఒకే ప్రధాని.. ఒకే జెండా ఒకే చట్టం అనే నినాదంతో జన సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను సాధించే దిశగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నవీన్ కుమార్, ఆనంద్‌రావు, బిజెపి నాయకులు శ్రీకాంత్, విఎస్టి రాజు, దామోదర్, పి.నర్సింగ్ రావు, ఎం.ఉమేష్, డి.ఎస్.రెడ్డి, సత్తి రెడ్డి, ఆకుల సురేందర్, ప్రకాష్ యాదవ్, సురేష్ రాజు, శ్రీనివాస్, నర్సింహ, నీరజ్, శివ కుమార్, శివ కృష్ణ, బీజేపీ మహిళా నాయకులు సంధ్యా రాణి, లావణ్య, సంయుక్త రాణి, పూర్ణ, లక్ష్మి, సుహాసిని, స్థానికులు రవి మన్యు, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply