మంచి నీటి సరఫరా సమస్యను పరిష్కరించండి
– డిజిఎంను కోరిన బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌రెడ్డి
హైదరాబాద్, మే 16, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ మోహన్‌నగర్, వైఎస్ఆర్ పార్క్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న మంచి నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ మాజీ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన చిలకలగూడ వాటర్‌వర్క్స్ డిజిఎం విష్ణువర్థన్‌ను కలిసి మోహన్‌నగర్, వైఎస్ఆర్ పార్క్ తదితర ప్రాంతాల్లో నెలకొన్న మంచి నీటి సరఫరా సమస్యను వివరించారు. మోహన్‌నగర్, వైఎస్ఆర్ పార్క్ తదితర ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సరిగ్గా లేదని, అలాగే సివరేజి సమస్య కూడా తీవ్రంగా ఉందని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అసలే వేసవి కాలం కావడంతో మంచినీటి సరఫరా సమస్య ఉండటంతో ప్రజలు నీటి కోసం ఇబ్బందులుపడుతున్నారన్నారు. మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిజిఎంను శ్రీధర్‌రెడ్డి కోరారు. ఇందుకు స్పందించిన డిజిఎం మంచినీటి సరఫరా సమస్యను పరిష్కరిస్తామని హామినిచ్చారని శ్రీధర్‌రెడ్డి తెలిపారు. డిజిఎంను కలిసిన వారిలో మోహన్‌నగర్, వైఎస్ఆర్ పార్క్ బస్తీవాసులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply