కాచిగూడ, సెప్టెంబర్ 21, ( అద్దం న్యూస్ ) : కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా జరుపుకునే పండుగ వినాయకచవితి అని కాచిగూడ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి.వీరకౌశిక్ అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గం గోల్నాకలోని ‘శ్రీ సాయి రెసిడెన్సీ’ అపార్ట్‌మెంట్‌లో ప్రతిష్ఠించిన వినాయకునికి ఆయన అపార్ట్‌మెంట్ వాసులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ బి.వీరకౌశిక్ మాట్లాడుతూ… మండపాల నిర్వాహకులు, ప్రజలు నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాలని సూచించారు. ఈ పూజా కార్యక్రమంలో సాయి రెసిడెన్సీ ప్రతినిధులు నాగరాజ శర్మ, భోగ వెంకటయ్య, లక్ష్మీనారాయణ, వెంకట్‌రెడ్డి, పాక స్వామి, ప్రేమ్‌కుమార్, రాంబాబు, శైలేష్, సందేశ్, పి.రమేష్, శ్రీనివాస్, రిషి తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.pngవిఘ్నేశ్వరునికి విశిష్ట పూజలు – గోల్నాకలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వీరకౌశిక్ ప్రత్యేక పూజలు
RELATED ARTICLES

