జూలై 10 న శ్రీ రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ళ్యాణం

ఆరె క‌టిక అభివృద్ధి సంఘం ఆధ్వ‌ర్యంలో
జూలై 10 న శ్రీ రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ళ్యాణం

హైదరాబాద్,  జూన్ 11, ( అద్దం న్యూస్ ) : ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర క‌మిటీ ఆధ్వ‌ర్యంలో జూలై 10వ తేదీన కోకాపేట్‌లో నిర్వ‌హించ‌నున్న లోక క‌ళ్యాణి అమ్మ‌వారు శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ళ్యాణానికి సంబంధించిన పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో జ‌రిగింది. ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు, బిసి జేఏసి క‌న్వీన‌ర్‌, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి గ‌జ్బిన్క‌ర్ భూంప‌ల్లి అశోక్ దాదా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య శ్రీ రేణుక ఎల్ల‌మ్మ త‌ల్లి క‌ళ్యాణానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా అశోక్ దాదా మాట్లాడుతూ… గ‌త సీఎం కెసిఆర్ ఆరె క‌టిక కులానికి ఇచ్చిన ఎక‌రం భూమిలోనే ఈ శ్రీ రేణుక ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి రాష్ట్ర వ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుల బంధువులను సైతం ఆహ్వానిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఎకరం భూమి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిది. మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అన్ని పార్టీల నాయకులను, ప్రజాసంఘాల, కుల సంఘాల ఉద్యమకారులను ఆహ్వానిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నందీశ్వ‌ర్‌, ఉపాధ్య‌క్షుడు నాగ‌శేషు, కోశాధికారి కెడి.దినేష్‌, న‌గ‌ర మ‌హిళా అధ్య‌క్షురాలు స‌ర‌స్వ‌తి బాయి, జాయింట్ సెక్ర‌ట‌రి శ్రీనివాస్‌, ప్ర‌సాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page