6న తుల్జాభవన్‌లో శ్రీ సీతారాముల కళ్యాణం

 

కాచిగూడ‌, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ : దేవాదాయ, ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన ఆదివారం కాచిగూడలోని తుల్జాభవన్ ధర్మశాల శ్రీరామ మందిరం ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను నిర్వహించ‌నున్న‌ట్లు తుల్జాభవన్ ధర్మశాల కార్యనిర్వహణాధికారి ఎస్.అంజనారెడ్డి తెలిపారు. శుక్రవారం తుల్జాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉదయం 10 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమవుతుందని, మ‌ధ్యాహ్నం ఒంటి గంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. రాత్రి 7 గంటలకు ఉత్సవమూర్తుల పల్లకి ఊరేగింపు జరుగుతుందని, కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కళ్యాణం చేయించాలనుకునే భక్తులు ముందుగా రూ.1,116 చెల్లించి రసీదు తీసుకోవాలని కోరారు. కాచిగూడ భజన మండలి కళాకారులచే భజనలు, సంకీర్తనలు ఉంటాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామి వారికి పూజాధికము, అలంకారము, పుష్పము, కుంకుమతో సహస్త్రార్చనలు జరుగుతాయన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page