దేశ నిర్మాణంలో ఉక్కు పరిశ్రమది కీలక భూమిక – ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ఎండి ప్రమోద్ అగర్వాల్

 

సికింద్రాబాద్, అద్దం న్యూస్   దేశ నిర్మాణంలో ఉక్కు పరిశ్రమది కీలక భూమిక అని ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ఎండి ప్రమోద్ అగర్వాల్ అన్నారు. సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని 19 టవర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కొత్తగా తయారుచేసిన తుప్పు పట్టని స్టీల్ ఉత్పత్తిని తుప్పు పట్టని 600 ప్లస్ సిఎస్ఆర్ స్టీల్ లాంచనంగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫౌండ్రీస్ కొత్త ఉత్పత్తులకు నాంది పలుకుతూ వివిధ నిర్మాణాలలో ఉపయోగిస్తున్న తుప్పు పట్టకుండా దృఢంగా బలంగా ఉండడం కోసం అనునిత్యం కొత్త కొత్త ఆవిష్కరణలను చేపడుతున్నామన్నారు. రానున్న మూడు నాలుగు సంవత్సరాలలో 1200 కోట్ల ఖర్చుతో దాదాపు 5000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలకు అవసరమైన స్టీల్ వివిధ సైజులలో తయారు చేసి దేశ వ్యాప్తంగా తమ డీలర్ల ద్వారా అంద‌చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 600 ప్లస్ సిఎస్ఆర్ స్టీల్ ఎంతో నమ్మకమైనదిని, అన్ని రకాల నిర్మాణాలలో కొత్తగా తాము ఉత్పత్తి చేసిన తుప్పు పట్టని స్టిల్ దీర్ఘకాలం ఉంటుందని తెలిపారు. ఇది ప్రపంచస్థాయి నిర్మాణాలకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. తాము అన్ని రకాల ఆర్ అండ్ డి పరీక్షల అనంతరం ఈ స్టీల్‌ను విడుదల చేయడం జరిగిందన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page