అక్రమ గోవధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

అక్రమ గోవధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలి
– న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సజ్జ‌నార్‌కు బిజేవైఎం నాయ‌కుల విన‌తి

హైదరాబాద్, మే 18, ( అద్దం న్యూస్ ) :   అక్రమ గోవధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిరాపరాధ హిందూ యువతను ఇబ్బంది పెట్టకూడదని కోరుతూ బిజేవైఎం నాయ‌కులు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్‌ను కోరారు. ఈ మేర‌కు బిజేవైఎం గోల్కోండ జిల్లా అధ్య‌క్షుడు నితిన్ నంద‌క‌ర్‌, ఉపాధ్య‌క్షుడు గోపాల్‌, కార్య‌వ‌ర్గ స‌భ్యుడు లాలా జి ధీర‌జ్‌, బిజెవైఎం నాయ‌కుడు నితిన్ జైశ్వాల్‌, క‌మ‌లాక‌ర్ సాయినాథ్ త‌దిత‌రులు సోమ‌వారం న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. గోమాత రక్షణ కోసం శాంతియుతంగా పనిచేస్తున్న హిందూ యువకులపై అనవసరమైన చర్యలు లేదా తప్పుడు కేసులు నమోదు చేయవద్దని కోరారు. గోమాతను రక్షించడం, సమాజంలో శాంతి భద్రతలను కాపాడడం, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడం బిజెవైఎం సాంప్రదాయం అని బిజెవైఎం నాయ‌కులు తెలిపారు. చ‌ట్టానికి పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని, గో ర‌క్ష‌ణ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న యువ‌త‌కు న్యాయం చేయాల‌ని సిపిని కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page