జేఈఈ మెయిన్స్‌లో ప‌ర్సంటేజ్‌ రాలేద‌ని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

 

జేఈఈ మెయిన్స్‌లో ప‌ర్సంటేజ్‌ రాలేద‌ని విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌

హైదరాబాద్, మే 14, అద్దం న్యూస్ :    ఈ మ‌ధ్య‌న విడుద‌లైన జేఈఈ మెయిన్స్ ఫ‌లితాల్లో అనుకున్నంత ప‌ర్సంటేజ్‌రాక‌పోవ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన విద్యార్థి ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న నారాయ‌ణ‌గూడ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగింది. నారాయ‌ణ‌గూడ ఇన్‌స్పెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ తెలిపిన ప్ర‌కారం వివరాలిలా ఉన్నాయి… భ‌ద్రాది కొత్త‌గూడం జిల్లా పోస్ల‌గ్‌గూడం బానేతండాకు చెందిన ద‌రావ‌త్ ప్ర‌వీణ్ ( 20 ) హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడలోని అభ్య‌శ్రే హాస్ట‌ల్‌లో ఉంటూ జేఈఈ ప‌రీక్ష‌ల‌ను రాసేందుకు ప్రిపేయిర్ అవుతున్నాడు. జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను రాసిన త‌ర్వాత ఇటీవ‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. ఈ ఫ‌లితాల్లో అనుకున్నంత ప‌ర్సంటేజ్ ప్ర‌వీణ్‌కు రాలేదు. దీంతో ప్ర‌వీణ్ తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యాడు. ఈ నేప‌ధ్యంలో ఈ నెల 13వ తేదీన త‌ల్లిదండ్రులు ఫోన్ చేయ‌గా ప్ర‌వీణ్ ఫోన్ ఎత్త‌లేదు. దీంతో వారికి అనుమానం వ‌చ్చి హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడ‌లోని హాస్ట‌ల్‌కు వ‌చ్చి చూశారు. హాస్ట‌ల్ గ‌దిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్ర‌వీణ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ప్ర‌వీణ్ తండ్రి ద‌రావ‌త్ రాందాస్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు నారాయ‌ణ‌గూడ పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తండ్రి ఫిర్యాదు మేర‌కు ఆత్మ‌హ‌త్య కేసుగా న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page