Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఅడిక్‌మెట్‌లో విజ‌య‌వంత‌మైన‌ బిఆర్ఎస్ యువ‌జ‌న విభాగం స‌మావేశం

అడిక్‌మెట్‌లో విజ‌య‌వంత‌మైన‌ బిఆర్ఎస్ యువ‌జ‌న విభాగం స‌మావేశం

📰 Generate e-Paper Clip

అడిక్‌మెట్‌లో విజ‌య‌వంత‌మైన‌ బిఆర్ఎస్ యువ‌జ‌న విభాగం స‌మావేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 22, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న విభాగం స‌మావేశం ఆదివారం జ‌రిగింది. ఈ స‌మావేశానికి 25 మంది క్రియాశీల‌క స‌భ్యులు పాల్గొని, రాబోయే కాలంలో పార్టీ బ‌లోపేతం, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం విస్తృతంగా చర్చించారు. యువత తలచుకుంటే మార్పు సాధ్యమని నిరూపిస్తూ, మన అడిక్‌మెట్ అభివృద్ధి కోసం మనమందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతామ‌ని యువ‌జ‌న విభాగం నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. ఈ స‌మావేశంలో హరీష్, వికాస్, అస్లాం, జ్ఞానేష్, రింకు, టక్కర్ , రఘు, దయాకర్, అన్వేష్, న‌ర్సింగ్‌, యోగేష్, న‌రేష్‌, కనకరాజ్, ఆసిఫ్, హఫీజ్, మనోజ్, సాయి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page