Saturday, September 19, 2026
No menu items!
Homeculturalsఘనంగా స్వర తరంగిణి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా స్వర తరంగిణి వార్షికోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

 

ఘనంగా స్వర తరంగిణి వార్షికోత్సవ వేడుకలు

సిటి క‌ల్చ‌ర‌ల్‌, మే 3, అద్దం న్యూస్ :    స్వర తరంగిణి సాహితి సంస్కృతిక సేవ సంస్థ తృతీయ వార్షికోత్సవం పురస్కరించుకొని దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ప్రముఖ గాయని సాయి పావని నిర్వహణలో జంట నగరాల గాయని గాయకులచే సినీ సంగీత విభావరి చిక్కడపల్లి శ్రీ తగరాయ గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంశీరామరాజు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వర తరంగిణి సంస్థ విలక్షణమైన కార్యక్రమాలను చేపడుతూ.. గాయని గాయకులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. దాసరి నారాయణరావు జయంతి వేడుకలను నిర్వహించడం సంతోషిదాయకమన్నారు. అనంతరం టీవీ ఆర్టిస్ట్ లక్ష్మీ నారాయణ కు సినీ శ్రామికరత్న అవార్డుతో పాటు ప్రముఖ గాయకుడు వెంకి చింతకు ఆత్మీయ సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు త్రినాధరావు, కళాసేవక్ పురస్కార గ్రహీత వెంకట్రావు, గాయకుడు శశివర్ధన్, ఆకృతి డెవలపర్ అధినేత కె.గిరి, సంస్థ అధ్యక్షులు సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page