బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేలా చ‌ర్య‌లు తీసుకోండి

బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేలా చ‌ర్య‌లు తీసుకోండి

హైదరాబాద్, మే 7, ( అద్దం న్యూస్ ) :    బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముషీరాబాద్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి కోరారు. ఈ మేర‌కు గురువారం జీహెచ్ఎంసీ ఎలక్షన్ అడిషనల్ కమిషనర్ చంద్రకళను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సంద‌ర్భంగా శ్రీధ‌ర్‌రెడ్డి మాట్లాడుతూ… నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని పోలింగ్ బూత్‌ల‌లో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి స‌ర్ మ్యాపింగ్‌ను చేయాల‌ని కోరారు. 2002లో వేసిన ఓట‌ర్ల పేర్లు క‌నిపించ‌డంలేద‌ని, ప్ర‌జ‌లంద‌రూ అయోమ‌య‌స్థితిలో ఉన్నార‌ని, ఇంటింటికి తిరిగితే అన్ని సందేహాలు నివృత్తి అవుతాయ‌న్నారు. ఈ విష‌యం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేర‌కు అధికారికి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశామ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉండే వివాహి మ‌హిళ‌ల పేర్ల‌ను స‌ర్ లో చేర్చాలంటే ఆమెకు సంబంధించిన తండ్రి నుంచి ధృవీక‌ర‌ణ కావాల‌నే నిబంధ‌న ఉంద‌ని, చాలా మంది మ‌హిళ‌ల తండ్రులు మృతి చెంది ఉండి ఉంటార‌ని, అలాంటి వారి ప‌రిస్థితి ఎలా అని చంద్ర‌క‌ళని శ్రీధ‌ర్‌రెడ్డి అడిగారు. ఇలాంటి సందేహాల‌ను నివృత్తి చేయాలంటే బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న చేయాల‌ని కోరారు. ఇందుకు స్పందించిన చంద్ర‌క‌ళ బిఎల్ఓల‌ను ఇంటింటికి తిరిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముషీరాబాద్ డిఎంసి ప్ర‌వీణ్‌రెడ్డికి చెబుతాన‌ని చెప్పార‌ని శ్రీధ‌ర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్త త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page