Saturday, October 17, 2026
No menu items!
HomeGREATER HYDERABADప్రజా సంక్షేమానికి టాస్క్‌ కృషి – పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

ప్రజా సంక్షేమానికి టాస్క్‌ కృషి – పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం

📰 Generate e-Paper Clip

తార్నాక, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) :     తార్నాక ప్రాంత ప్రజల సంక్షేమం, పౌర సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తార్నాక అసోసియేషన్ ఫర్ సర్వీస్ అండ్ నాలెడ్జ్ ( టాస్క్ ) 1996 నుంచి సేవలందిస్తోందని సంస్థ అధ్యక్షురాలు సి.మంజుల రాజు సాగర్ తెలిపారు. రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, ట్రాఫిక్, పార్కింగ్ తదితర సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తూ నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా పారిశుద్ధ్య చర్యలు, మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ, స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. తార్నాకలోని టాస్క్‌ పార్కు అభివృద్ధికి చర్యలు చేపట్టామని, భవిష్యత్తులో వృద్ధుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, రోడ్డు భద్రత, ప్రజారోగ్య అవగాహనకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. సంస్థకు సహకరిస్తున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్‌, బండ చంద్ర రెడ్డి, మోతా శోభన్ రెడ్డి, డాక్ట‌ర్‌.రావు చెలికానికి, టాస్క్‌ కమిటీ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ నర్సింహా, వీరన్న, రాజు, విజయ్ ఆనంద్, ఉపేందర్, రామకృష్ణ రెడ్డి, హనుమాన్, సుబ్రహ్మణ్యం, ముజాహిద్, ఖాలిద్, దస్తగిరి అలీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page