Saturday, October 17, 2026
No menu items!
Homedevotionalశ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ప్రారంభ‌మైన దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ప్రారంభ‌మైన దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు

📰 Generate e-Paper Clip

భోల‌క్‌పూర్‌, అక్టోబర్ 11, ( అద్దం న్యూస్ ) :     హైద‌రాబాద్ న‌గ‌రం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ డివిజ‌న్‌లో 400 ఏళ్ల చ‌రిత్ర ఉన్న దేవునితోటలోని శ్రీ భ‌వాని శంక‌ర దేవాల‌యంలో ద‌స‌రా దేవీ శర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాలు భ‌క్తి శ్ర‌ద్ధ‌లతో ఆదివారం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న మ‌హోత్స‌వాల్లో భాగంగా తొలి రోజు అమ్మ‌వారిని శ్రీ బాలాత్రిపుర సుంద‌రీ దేవి రూపంలో అలంక‌రించారు. ఈ సంద‌ర్భంగా అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ఈవో కె.రాజేష్ కుమార్ మాట్లాడుతూ… దేవి శ‌ర‌న్న‌వ‌రాత్రి మ‌హోత్స‌వాల్లో భాగంగా అమ్మ‌వారిని ప్ర‌తి రోజు విశేష రూపాల్లో అలంక‌రించి పూజ‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

12వ తేదీన‌ శ్రీ గాయత్రి దేవి అలంకరణ రూపంలో, 13 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకరణ రూపంలో, 14 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ రూపంలో, 15 న శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకరణ రూపంలో, 16 న శ్రీ సరస్వతీ దేవి అలంకరణ రూపంలో, 17 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ రూపంలో, 18 న శ్రీ దుర్గా దేవి అలంకరణ రూపంలో, 19 న శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకరణ రూపంలో 20 న శ్రీ భవాని దేవి అలంకరణ రూపంలో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య సిబ్బంది మిక్కిలినేని సురేష్‌, ఆల‌య పూజారులు, మ‌హిళా భ‌క్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page