శ్రీ పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి నేత‌లు

శ్రీ పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి నేత‌లు

నారాయ‌ణ‌గూడ‌, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ :  హైద‌రాబాద్ నారాయ‌ణ‌గూడ గాంధీ కుటీర్‌లో గ‌ల శ్రీ భూలక్ష్మి దుర్గా దేవి ఆలయంలో శ‌నివారం శ్రీ పార్వతి పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ పుణ్య కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వర్గం నాయ‌కులు న‌ల్లెల్ల కిశోర్, పలుస బాలరాజ్ గౌడ్, ప్రదీప్ గౌడ్, యాదగిరి గౌడ్, బి.శ్యామ్, కిరణ్ కుమార్, టి.వినోద్, శుక్లవేది, యాదగిరి, ఆనంద్ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వేదపండితులు వేదమంత్రాలతో కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా, నాయకులు భక్తి భావంతో దేవతలను దర్శించుకుని తమ కుటుంబ సభ్యుల సుఖశాంతులు, ప్రజల అభ్యున్నతి కోసం పూజ‌లు చేశారు. అలాగే ప్రాంత ప్రజల శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, శ్రేయస్సు, విజయాల కోసం అమ్మవారి ఆశీస్సులు కోరారు, పార్టీ మరింత బలోపేతం కావాలని వారు కోరుకున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page